| శ్రీ శ్రీ శ్రీ శ్రీధర గురూజీ |
నావరకు నాకు జీవితం ఒక అమూర్త భావన కాదు. జీవితానికో పరమార్ధం ఉంది. అయితే ఆ అర్ధాన్ని వెతుక్కునే అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వేదాల్లో అది "సర్వం ఖల్విదం బ్రహ్మ" గా చెప్పబడింది. ఈ అనంత విశ్వం లోని ప్రతి జీవి ఉనికీ, అది సజీవమైనా, నిర్జీవమైనా, మనకు కనిపించేవి , కనబడనివి, మన ఊహా జనితమైనవి , ఊహాతీతమైనవి అన్నీ ఈ సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ప్రాతిపదికలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటీ బ్రహ్మమేనని మన వేదాల్లో సుందరంగా చెప్పబడింది.
"బ్రహ్మం"అనే ఈ ప్రాతిపదిక , చైతన్యమనే భావనలోంచి పుట్టింది. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని ఋగ్వేదం చెబుతోంది. స్వచ్చ్చమయిన జ్ఞానం లేదా స్వచ్చ్చమయిన చైతన్యమే "బ్రహ్మం". సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్పిందికుడా వేదమే. చాలా మంది ఇది పరస్పర విరుద్ధం అనుకుంటారు. ఏ రెండు వ్యాఖ్యలు ఒక దానికొకటి సహజమైన సంపూరకాలు. "స్వచ్చమైన జ్ఞానం బ్రహ్మ" మరియు సర్వం ఖల్విదం బ్రహ్మ అంటే "నీవు నీ మనసుతో చూడగలిగిన ఏదైనా బ్రహ్మ"అని చెప్పబడింది. చైతన్య స్థితి కలిగిన ఏదైనా అది బ్రహ్మం తప్ప వేరు కాదు. మనిషిని నిశితంగా గమనిస్తే తానెప్పుడూ చైతన్య రహితుడే. వస్తుతః మనిషి ఈ సమగ్రమైన చైతన్యాన్ని కలిగి ఉండడు.
..........................................................రేపు రెండవ భాగం
శ్రీధరామృతం పేరిట నేను రామ తీర్థ గారు చేసిన అనువాదం ఈ పుస్తకం. ఇందులోనుండే మీకు గురూజీ అనుగ్రహ భాషణం .....ప్రేమతో....జగతి
No comments:
Post a Comment